మేడారం జాతర కోసం ప్రత్యేకంగా యాప్ రెడీ చేశామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆర్టీసీ చరిత్రలోనే తొలిసారి మేడారం విత్ టీఎస్ ఆర్టీసీ యాప్ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈనెల 13 నుంచి జాతర రద్దీ స్టార్ట్ అవుతుందని.. 12 వేల మంది సిబ్బంది జాతర విధుల్లో ఉంటారన్నారు. వరంగల్ నుంచి 2 వేలకు పైగా బస్సులు నడుపుతున్నామన్నారు. ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి... సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. 11 మొబైల్ మెకానికల్ టీమ్స్ మేడారం రూట్ లో ఉంటారని.. బస్సులు మధ్యలో ఆగకుండా 25 ఛేజింగ్ స్వాడ్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు.
మరిన్ని వార్తల కోసం