కోల్ టూరిజం కారిడార్ ఏర్పాటుకు కృషి

కోల్ టూరిజం కారిడార్ ఏర్పాటుకు కృషి

పెద్దపల్లి జిల్లా : సింగరేణి ఆర్జీ 2 పరిధిలోని వకీల్ పల్లి మైన్ ను కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సందర్శించారు. వకీల్ పల్లి మైన్ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. ఈసందర్భంగా సింగరేణి సీఎండీ శ్రీధర్ కు అభినందనలు తెలిపారు. టూరిజానికి సంబంధించి సింగరేణిలో మంచి అవకాశాలు ఉన్నాయని.. ఈ అంశంపై సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఒక కోల్ టూరిజం కారిడార్ ను ఏర్పాటు చేస్తామని సజ్జనార్ వెల్లడించారు.