గుడ్ న్యూస్: మెట్రో డీలక్స్​ మంత్లీ బస్ పాస్ రూ. 1,450

  •      సిటీ ప్యాసింజర్లకు మళ్లీ అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ
  •     అన్ని బస్​పాస్​సెంటర్లలో పాస్ తీసుకోవచ్చు  
  •     మెట్రో డీలక్స్, ఎక్స్ ప్రెస్, ఈ- ఎక్స్ ప్రెస్ (నాన్- ఏసీ )ల్లోనూ జర్నీ చేయొచ్చు
  •     గ్రేటర్ సిటీ జోన్​ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడి

హైదరాబాద్, వెలుగు :  సిటీ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ మెట్రో డీలక్స్ మంత్లీ బస్ పాస్ లను మళ్లీ బుధవారం నుంచి అందుబాటులోకి తెచ్చినట్టు గ్రేటర్ హైదరాబాద్ జోన్​ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు తెలిపారు. రూ 1,450తో  సిటీలోని బస్​పాస్​సెంటర్లలో తీసుకోవచ్చనని సూచించారు. మెట్రో డీలక్స్​బస్ పాస్ తో మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్ ప్రెస్, 
ఈ- – మెట్రో ఎక్స్ ప్రెస్ (నాన్- ఏసీ ), ఆర్డినరీ బస్సుల్లో సిటీ, సబర్బన్ పరిధిలో ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.  

Also Read:-జనవరి నుంచి సన్నబియ్యం

ఏసీ, ఏఎమ్​, ఏఎల్, ఏజీ రూట్లలో తిరిగే పుష్పక్ బస్సుల్లో శంషాబాద్, ఆరాంఘర్, గచ్చిబౌలి, బాలాపూర్ క్రాస్ రోడ్స్, ఎల్ బీనగర్ నుంచి ఎయిర్ పోర్టుకు జర్నీ చేసే ప్రయాణికులకు పుష్పక్ ఏసీ మంత్లీ రూట్ పాస్, 8 కి.మీ పరిధిలో రాకపోకలకు వర్తించే మంత్లీ రూట్ పాస్ లను కూడా అందుబాటులోకి తెచ్చినట్టు ఆయన వెల్లడించారు.  పుష్పక్ ఏసీ జనరల్ మంత్లీ బస్ పాస్ రూ. 5,000-, గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ మంత్లీ బస్ పాస్ రూ.1900-, మెట్రో ఎక్స్ ప్రెస్ మంత్లీ బస్ పాస్ రూ.1300, సిటీ ఆర్డినరీ మంత్లీ బస్ పాస్ రూ.1150- ధరలతో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయని గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.