గ్రేటర్ హైదరాబాద్​లో మహిళలు, సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటిజన్లకు సంస్థ కొత్త ఆఫర్

గ్రేటర్ హైదరాబాద్​లో మహిళలు, సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటిజన్లకు సంస్థ కొత్త ఆఫర్
  •     ఫ్యామిలీ కోసం రూ.300తో ఎఫ్ 24 టికెట్
  •     పోస్టర్ రిలీజ్​చేసిన ఎండీ సజ్జనార్

హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికులను, టూరిస్టులను ఆకర్షించేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రెండు కొత్త ఆఫర్లు ప్రకటించారు. గురువారం బస్ భవన్ లో ఆయన ఈ ఆఫర్లకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీ-6, ఫ్యామిలీ-24 పేరుతో కొత్త టికెట్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. శుక్రవారం నుంచి కండక్టర్ల వద్ద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలు, సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటిజన్ల కోసం టీ-6 టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ టీ6 టికెట్​పై రూ.50 చెల్లించి గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ఆరు గంటల పాటు వారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చెల్లుబాటు అవుతుందని వివరించారు.

టీ-6 టికెట్లను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇస్తారని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీటిని మంజూరు చేయరన్నారు. 60 ఏండ్లు పైబడిన సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటిజన్లకు కూడా టీ-6 టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్తిస్తుందని, టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకునే సమయంలో ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు చూపించాల్సి ఉంటుందన్నారు. ఇక వీకెండ్, హాలిడేస్ లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ప్రయాణించేందుకు ఫ్యామిలీ-24 టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.300 చెల్లిస్తే.. నలుగురు సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో రోజంతా ప్రయాణించవచ్చని చెప్పారు. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో మాత్రమే ఈ ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉంటుందన్నారు. 24 గంటల పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న టీ24 టికెట్ కు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ ఉందని, ఈ ఏడాది ఫైనాన్సియల్ ఇయర్ లో 55.50లక్షల మంది ఈ టికెట్ ను కొన్నారని సజ్జనార్ తెలిపారు. ప్రస్తుతం ప్రతి రోజు సగటున 25 వేల వరకు ఆ టికెట్లు అమ్ముడవుతున్నాయన్నారు.