బెంగళూరు రూట్​లో ఆర్టీసీ 10% రాయితీ

బెంగళూరు రూట్​లో ఆర్టీసీ 10%  రాయితీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బెంగళూరుకు వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్సులో పది శాతం రాయితీ ఇస్తున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. 

ఏసీ స్లీపర్ బస్సులతో పాటు సూపర్ లగ్జరీ వరకు అన్ని రకాల బస్సుల్లో ఈ రాయితీ వర్తిస్తుందని సంస్థ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. బెంగళూరు రూట్​లో వెళ్లే బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడంతో  జనాన్ని ఆకర్షించేందుకు ఆర్టీసీ ఈ రాయితీని ప్రకటించింది. ప్రైవేట్ ట్రావెల్స్ పోటీని తట్టుకునేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.