భువనగిరి స్వర్ణగిరి టెంపుల్ కు .. గ్రేటర్​ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

భువనగిరి స్వర్ణగిరి టెంపుల్ కు ..  గ్రేటర్​ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్, వెలుగు: భువనగిరిలోని స్వర్ణగిరి ఆలయానికి వెళ్లే భక్తుల సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. వీకెండ్స్, హాలిడేస్, పండుగల టైంలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. భక్తుల సౌకర్యార్థం గ్రేటర్​హైదరాబాద్​ఆర్టీసీ అధికారులు సిటీ నుంచి స్వర్ణగిరికి ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించారు. బుధవారం నుంచి స్పెషల్​సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు గ్రేటర్​ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్​డైరెక్టర్​ వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

జేబీఎస్​నుంచి రెండు ఈ- మెట్రో ఎక్స్​ప్రెస్​నాన్ ఏసీ బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. అవి ఉదయం 7, 8 గంటలకు జేబీఎస్​నుంచి బయలుదేరి స్వర్ణగిరికి వెళ్తాయి. మధ్యాహ్నం 2.50, 3.50 గంటలకు స్వర్ణగిరి నుంచి బయలుదేరుతాయి. అలాగే ఉప్పల్​ఎక్స్​రోడ్​నుంచి స్వర్ణగిరికి ఉదయం 7.30, 8.30, 10.35, 11.35గంటలకు, మధ్యాహ్నం 3.20, 4.20గంటలకు, సాయంత్రం 6.25, 7.25 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయి.

స్వర్ణగిరి నుంచి జేబీఎస్​కు మధ్యాహ్నం 12.10, 1.10గంటలకు, రాత్రి 8, 9 గంటలకు అందుబాటులో ఉంటాయి. స్వర్ణగిరి నుంచి ఉప్పల్​ఎక్స్​రోడ్ కు ఉదయం 8.55, 9.55 గంటలకు, సాయంత్రం 4.45, 5.45గంటలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. జేబీఎస్​నుంచి వెళ్లే బస్సుల్లో ఒక్కొక్కరికి టికెట్​ధరను రూ.100గా, ఉప్పల్​క్రాస్​రోడ్స్​ నుంచి అయితే రూ.80గా నిర్ణయించారు.