
మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ సేవలు నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆదివాంర (ఏప్రిల్ 20) తెల్లవారుజామున 3 గంటల నుంచి బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణికులు బస్ స్టాండ్ లో గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టికెట్ ఇష్యూ చేసే(Tmc) మిషన్ సాంకేతిక లోపం వల్ల నిలిచిపోవడంతో ఆర్టీసీ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో మంచిర్యాల డిపో బస్సులు బయటికే రాలేదు. ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇవ్వాల (ఏప్రిల్ 20) ఆదివారం సెలవు కావడంతో బస్ డిపోలో అందుబాటులో అధికారులు ఎవరు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.