ఫిట్స్​తో అస్వస్థతకు గురైన యువతి.. మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది

ఫిట్స్​తో అస్వస్థతకు గురైన  యువతి.. మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది

లింగాల, వెలుగు: ఫిట్స్​తో అస్వస్థతకు గురైన ప్రయాణికురాలికి వెంటనే వైద్యం అందించేందుకు ఓ ఆర్టీసీ  డ్రైవర్​ బస్సును సరాసరి ప్రభుత్వ దవాఖానకే తీసుకువెళ్లాడు. నాగర్​కర్నూల్​ జిల్లా పదర మండలానికి చెందిన పూజశ్రీ తమ్ముడు లింగాలలోని గురుకుల స్కూల్​లో చదువుకుంటున్నాడు. పూజశ్రీ తన అమ్మ, అక్కతో కలిసి తమ్ముడిని చూడడానికి అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కింది. లింగాల సమీపంలోకి చేరుకోగానే ఆమెకు ఫిట్స్  వచ్చింది.  

ఇది చూసిన డ్రైవర్  అర్జున్  వెంటనే బస్సును సరాసరి లింగాల ప్రభుత్వ దవాఖానకు తీసుకువెళ్లాడు. లోపల ఉన్న ప్రయాణికులు కూడా అభ్యంతరం చెప్పలేదు. అక్కడికి వెళ్లాక అందరూ కలిసి పూజశ్రీని దవాఖానలో చేర్పించారు. ప్రాథమిక చేసిన తర్వాత మెరుగైన వైద్యం కోసం108లో నాగర్​కర్నూల్  జిల్లా దవాఖానకు తరలించారు. పూజశ్రీ అచ్చంపేట మండలం ఐనోల్  స్కూల్​లో 8వ తరగతి చదువుతోంది. ఫిట్స్​ వచ్చిన బాధితురాలిని ఆలస్యం చేయకుండా  హాస్పిటల్​కు రతలించిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులను పలువురు అభినందించారు.