సూర్యాపేట నుంచి  అరుణాచలానికి బస్సులు

సూర్యాపేట, వెలుగు: ప్రతి పౌర్ణమికి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలగిరి ప్రదక్షిణకు వెళ్లాలనుకునే భక్తుల కోసం సూర్యాపేట డిపో నుంచి స్పెషల్ బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ సూర్యాపేట డీఎం సురేందర్ తెలిపారు. మంగళవారం బస్ సర్వీస్‌ ప్రారంభించి  మాట్లాడారు. అక్టోబర్ 27 శుక్రవారం రాత్రి 8 గంటలకు పేట కొత్త బస్టాండ్ నుంచి సూపర్ లగ్జరీ బస్సు అరుణాచలానికి బయల్దేరుతుందని చెప్పారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అమ్మవారి దర్శనం అనంతరం అరుణాచలానికి చేరుకుంటుందని వివరించారు.

గిరి ప్రదక్షిణ, తిరువన్నామలై నవ శివలింగాల దర్శనం పూర్తయ్యాక.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణమై అక్టోబర్ 30న సూర్యాపేటకు చేరుకుంటుందన్నారు. టిక్కెట్ ధర ఒక్కరికి రూ.4 వేలు నిర్ణయించామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.   బస్ టికెట్స్  బుకింగ్ కోసం - 7382836177, - 9032153066, -9959226306 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.