హైదరాబాద్, వెలుగు: ఆర్టీవోకు కొత్త లోగో వచ్చేసింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలోనే కొత్త లోగోను విడుదల చేశారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ఆదేశాలతో రిపబ్లిక్‌డే సందర్భంగా కొత్త లోగోతో సిబ్బంది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
లోగోలో భారత రాజముద్ర మూడు సింహాల గుర్తు, కింద బస్సు చక్రం, దానికి రెండు వైపులా వరి కంకులు, మధ్యలో ఇంగ్లీష్‌లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను ఇండికేట్ చేస్తూ.. టీజీటీడీ లెటర్స్తోపాటు రోడ్ సెఫ్టీ అవర్ప్రయార్టీ అనే మేసేజ్‌తో ఈ లోగోను రూపొందించారు.