హైదరాబాద్లో ఆర్టీఓ అధికారుల తనిఖీలు..వనస్థలిపురం దగ్గరే ఆగిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్

హైదరాబాద్లో ఆర్టీఓ అధికారుల తనిఖీలు..వనస్థలిపురం దగ్గరే ఆగిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్

హైదరాబాద్లో ఆర్టీఓ అధికారులు కొరఢా ఝులిపించారు. బుధవారం (ఫిబ్రవరి12) సిటీలో విస్తృతంగా తనిఖీలు  చేపట్టారు. ఆర్టీఓ అధికారుల తనిఖీతో సరైన అనుమతులేని ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్స్ సిటీలోకి వచ్చేందుకు భయపడిపోతున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గంటల తరబడి సిటీ బయటే ఉండాల్సిన వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్లను, సంబంధిత కాల్స్ సెంటర్లకు ఫోన్ చేసి అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు ప్రయాణికులు చెబుతున్నారు. 

వనస్థలిపురం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ తనిఖీలు చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున ప్రైవేట్ ట్రావెల్స్ సిటీలోకి ఎంటర్ కాకుండా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీఓ దాడులకు భయపడి సిటీలో ఎంటర్ కావడం లేదని ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్స్ చెబుతున్నారు. ప్రయాణికులు కాల్ సెంటర్లకు ప్రయత్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం  చెబుతున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.