హైదరాబాద్, వెలుగు: మనదేశ రబ్బర్ సరఫరా గొలుసును పర్యావరణ అనుకూలంగా మార్చడమే లక్ష్యంగా ఇండియన్ సస్టెయినబుల్ నేచురల్ రబ్బర్( ఐఎస్ఎన్ఆర్) కార్యక్రమాన్ని రబ్బర్ బోర్డు ప్రారంభించింది. కొత్త టెక్నాజీలు, విధానాలతో దేశమంతటా పారదర్శక పద్ధతుల్లో రబ్బర్ సరఫరా గొలుసును ఏర్పాటు చేస్తామని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఆమోదించే పర్యావరణ అనుకూల పద్ధతులు, ఈయూ డీఫారెస్టేషన్ రెగ్యులేషన్(ఈయూడీఆర్) ప్రకారం ఐఎస్ఎన్ఆర్ను రూపొందించామని రబ్బర్బోర్డ్ ప్రకటించింది. ఐఎస్ఎన్ఆర్ సర్టిఫికేషన్ వల్ల రబ్బర్ తయారీదారులకు ఎంతో మేలు జరుగుతుందని, ఎగుమతులను పెంచవచ్చని బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వసంత నాగేశన్ చెప్పారు. అడవుల నరికివేత, అడవుల క్షీణతను తగ్గించడంలో ఐఎస్ఎన్ఆర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు.