గ్రీన్​ బడ్జెట్​పై మున్సిపల్​ మీటింగ్​లో రభస

గ్రీన్​ బడ్జెట్​పై మున్సిపల్​ మీటింగ్​లో రభస

వనపర్తి, వెలుగు: మున్సిపాలిటీలో తాజాగా రూ.5 లక్షలు గ్రీన్​ బడ్జెట్​కు కేటాయించడంపై పాలక, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. శనివారం మున్సిపల్​ సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే నెలలో పాలకవర్గ పదవీకాలం ముగియనుండడంతో ఇదే ఆఖరు సమావేశం కానుంది. సమావేశంలో గ్రీన్​ బడ్జెట్​కు నిధుల కేటాయించడంపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో నిధులు కేటాయించుకొని, మళ్లీ ఇప్పుడెందుకని నిలదీశారు.

మొదట్లో కేటాయించిన నిధులు లేవని చెప్పడంతో.. ఎక్కడికెళ్లాయని ప్రశ్నించడంతో సభ రసాభసాగా మారింది. కొత్తగా విగ్రహాలు ఏర్పాటు చేసే విషయంలోనూ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఒక్కో విగ్రహం ఏర్పాటుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు ఖర్చు అవుతున్నట్లు పేర్కొన్నారు. చౌరస్తాలో ప్రమాదాలు జరగకుండా చూసేందుకే విగ్రహాల ఏర్పాటులో మార్పు చేస్తున్నామని పాలకసభ్యులు తెలిపారు. మున్సిపల్​ చైర్మన్​ మహేశ్, కమిషనర్​ పూర్ణచందర్, కౌన్సిలర్లు 
పాల్గొన్నారు.