కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ చార్జ్ గా రుద్ర సంతోష్ కుమార్

కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ చార్జ్ గా రుద్ర సంతోష్ కుమార్

హైదరాబాద్, వెలుగు: కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా రుద్ర సంతోష్ కుమార్ ను నియమిస్తున్నట్టు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై పార్టీ నేతలు, క్యాడర్ కు ఆయన అందుబాటులో ఉంటూ పలు సూచనలు అందించనున్నట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన 31 ఎస్సీ, ఎస్టీ స్థానాలకు ఇన్ చార్జ్ గా వ్యవహరించారు.