![అథ్లెటిక్స్‌లో పలు మెడల్స్ సాధించిన దీక్షిత్](https://static.v6velugu.com/uploads/2025/02/rudrampur-polytechnic-student-dixit-wins-multiple-medals-at-state-level-sports-meet_a00DZ5fSlI.jpg)
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : హైదరాబాద్‌లోని రామంతాపూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ నెల 11,12 తేదీల్లో జరిగిన స్టేట్ లెవెల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో కొత్తగూడెంలోని రుద్రంపూర్ పాలిటెక్నిక్ స్టూడెంట్ దీక్షిత్ పలు మెడల్స్ సాధించారు.
లాంగ్ జంప్ తో పాటు అథ్లెటిక్స్ విభాగంలో 100 మీటర్లు, 200 మీటర్లు మూడు బంగారు పతకాలు, డిస్కస్ త్రో, 400 మీటర్ల విభాగంలో రెండు సిల్వర్ మెడల్స్ సాధించిన దీక్షిత్‌ను ఎస్పీ బి. రోహిత్ రాజు శుక్రవారం తన చాంబర్లో అభినందించారు. ఈ ప్రోగ్రామ్‌లో ఎంటీవో సుధాకర్, కాలేజీ పీడీ కృష్ణ, జాతీయ క్రీడాకారులు బాబ్జి, అమిత్, కోచ్ సుష్మభాయ్, మల్లికార్జున్, నాగరాజు, శ్రీనివాస్, వేణు పాల్గొన్నారు.