ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో రుద్రాంక్ష్‌‌‌‌కు గోల్డ్‌‌‌‌

 ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో రుద్రాంక్ష్‌‌‌‌కు గోల్డ్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌ షూటర్‌‌‌‌ రుద్రాంక్ష్‌‌‌‌ పాటిల్‌‌‌‌.. ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరిశాడు. అర్జెంటీనాలోని బ్యూనస్‌‌‌‌ ఎయిర్స్‌‌‌‌లో ఆదివారం జరిగిన మెన్స్‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌ రైఫిల్‌‌‌‌ ఫైనల్లో రుద్రాంక్ష్‌‌‌‌ 252.9 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. ఇస్తాన్‌‌‌‌ పెనీ (హంగేరి), ఎంజే గుటెరిజ్‌‌‌‌ (అర్జెంటీనా) వరుసగా సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ను సొంతం చేసుకున్నారు. ఇండియాకే చెందిన అర్జున్‌‌‌‌ బబూట ఏడో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు.