చేగుంట, వెలుగు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో గత నెల 30 నుంచి ఈ నెల 2 వరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో జరిగిన అండర్ 14 బాల, బాలికల రగ్బీ పోటీల్లో మెదక్ జిల్లా మూడో స్థానం సాధించినట్టు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు కరణం గణేశ్ రవికుమార్ తెలిపారు.
బాలికల విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోటీల్లో 15-0 స్కోర్ తేడాతో కరీంనగర్ జట్టుపై గెలవగా, బాలుర విభాగంలో 10-0 స్కోర్ తేడాతో గెలుపొందారని పేర్కొన్నారు. మెదక్ జిల్లా బాల, బాలికల టీమ్ మూడో స్థానం సాధించడం పట్ల మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు రమేశ్, సౌందర్య, అమూల్యమ్మ హర్షం వ్యక్తం చేశారు.