Ruhani Sharma Agra: వామ్మో రుహాని శర్మ బోల్డ్ ఫిల్మ్ ..ఇంత ఘాటు సీన్స్ ఎలా ?

చి.ల.సౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుహాని శర్మ(Ruhani Sharma).. తన నటనతో మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఆ చిత్రంతో మంచి మార్కులే కొట్టేసినప్పటికీ.. ఆ తరువాత పెద్దగా రాణించలేకపోయింది. హిట్‌, డర్టీ హరి,నూటొక్క జిల్లాల అందగాడు సినిమాల్లో నటించి మరోసారి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది.

అయితే సినిమాల్లో ఇప్పటి వరకు పెద్దగా హాట్ అందాల ఆరబోయని ఈ అమ్మడు..లేటెస్ట్ గా రుహానీ శర్మ నటించిన ఓ బోల్డ్ సెక్స్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగ్రా అనే హిందీ మూవీలో రుహనీ నటించగా తారీసెంట్ గా ట్రైలర్ రిలీజైంది.ఇందులో రుహాని శర్మ చేస్తున్న రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె తెలుగు సినీ అభిమానులందరూ హేయ్ రుహానీ, నువ్వేనా..ఇంత దారుణమైన సీన్‌లో దర్శనమిచ్చావ్ ఏంటి అంటూ వర్షం కురిపిస్తున్నారు. 

అంతేకాదు మోహిత్ అగర్వాల్, రాహుల్ రాయ్, ప్రియాంకా బోస్ లాంటి వాళ్లు కూడా చాలా బోల్డ్ గానే నటించారు. మోస్ట్ షాకింగ్ ఇండియన్ ఫిల్మ్ ఎవర్ మేడ్ అంటూ బీబీసీ ఇచ్చిన రివ్యూను ట్రైలర్ లో కూడా చూపించారు మేకర్స్.సంచలనం రేపుతోన్న ఈ ట్రైలర్ ప్రతిఒక్కరి దృష్టి ఈ సినిమాపై పడేలా చేసింది. 

ALSO READ :- Summer Alert : వడదెబ్బ ఇంట్లో ఉన్నా వస్తుందా.. వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి..!

అంతేకాదు ఈ ఆగ్రా మూవీ 2019లోనే  షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కానీ, ఇప్పటివరకు థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు. బుధవారం (ఏప్రిల్ 3న) ఫ్రాన్స్ లో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికీ ఈ సినిమాని 2023 మే 24న కేన్స్ లో ఫస్ట్ టైం స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఇక ఆ తర్వాత ఆగస్ట్ లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ లో,అక్టోబర్ లో బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఆగ్రా స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. అయితే ఇంతవరకు ఇండియాలో మాత్రం రిలీజ్ కాలేదు. మరి ఎప్పుడొస్తుందో చూడాలి. 

రీసెంట్గా రుహానీ శర్మ నటించిన Her –Chapter 1, సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీరంగ నీతులు మూవీ చేస్తోంది.

  • Beta
Beta feature