
కొంతమంది నటీనటులకు నటనపరంగా మంచి టాలెంట్ ఉన్నప్పటికీ కథలు సెలెక్షన్ సరిగ్గా లేకపోవడంతో సక్సెస్ కాలేకపోతుంటారు. దీనికితోడు అప్పటికే తాము నటించిన సినిమాలు ప్లాప్, డిజాస్టర్ కావడంతో ఆఫర్లు దక్కించుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అయితే తెలుగులో యంగ్ హీరో అక్కినేని సుశాంత్ హీరోగా నటించిన చి!! ల!! సౌ!! సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హిమాచల్ ప్రదేశ్ బ్యూటీ రుహాణి శర్మ కూడా ఈ కోవకే చెందుతుందని చెప్పవచ్చు.
అయితే రుహాణి శర్మ తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరుస ఆఫర్లు దక్కించుకుంది.. కానీ ఈ అమ్మడు నటించిన సినిమాల్లో హిట్: ది ఫస్ట్ కేస్ మినహా అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో హిందీలో కూడా ఆఫర్ల కోసం ట్రై చేసింది.. కానీ అక్కడ కూడా ఇదే పరిస్థితి.
Also Read :- ప్రపంచంలో రూ.200 కోట్లు భరణం వద్దనుకున్న ఏకైక నటి సమంత
ఈమధ్య రుహాణి శర్మ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో తరచూ తనకి సంబందించిన అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ రోజురోజుకి ఫాలోవర్స్ పెంచుకుంటోంది. అయితే తాజాగా రుహాణి శర్మ తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. గులాబీ రంగు డ్రెస్ లో క్లివేజ్ షో చేస్తూ బోల్డ్ గ ఫొటోలకి ఫోజులిచ్చింది.
దీంతో రుహాణి అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. అలాగే ఫ్యాన్ల కోసం రుహాణి గ్లామర్ డోస్ పెంచిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రుహాణి శర్మకి ఇన్స్టాలో దాదాపుగా 15 లక్షల పై చిలుకు ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఈ ఫోటోలు షేర్ చేసిన తక్కువ సమయంలోనే 50 వేలకిపైగా లైకులు కామెంట్లు వచ్చాయి..
ఈ విషయం ఇలా ఉండగా నటి రుహాణి శర్మ ఇటీవలే హిందీలో ఆగ్రా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు నూతన దర్శకుడు వికర్ణన్ అశోక్ దర్శకత్వం వహిస్తున్న చెన్నై నేపథ్యంలో సాగే డార్క్ కామెడీ థ్రిల్లర్ "మాస్క్" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో చార్లీ, బాల శరవణన్ మరియు వీజె అర్చన చందోక్ తదితరులు నటిస్తుండగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది.