
దేశంలో ప్రతి నెలా అనేక రకాల రూల్స్ మారుతుంటాయి. మార్చి 1 నుంచి కొత్త కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. ఇందులో కొన్ని ప్రజలకు లబ్ది చేకూర్చేవి అయితే మరికొన్ని జేబులు ఖాళీ చేసేవి. వీటిలో UPIకి సంబంధించిన కొత్త రూల్స్ ,LPG ,ATF ధరలలో మార్పులు ఉన్నాయి. ఇవాళ్టి(మార్చి1) నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ గురించి తెలుసుకుందాం.
UPIలో బీమా-ASB సౌకర్యం
మార్చి 1, 2025 నుంచి UPI వ్యవస్థకు బీమా ASB సపోర్టెడ్ బై బ్లాక్ అమౌంట్ అనే కొత్త ఫీచర్ జోడించారు. దీని ద్వారా జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీదారులు తమ ప్రీమియం చెల్లింపుకోసం ముందుగానే డబ్బును బ్లాక్ చేయొచ్చు. పాలసీ ప్రీమీయం తేదీన ఖాతానుంచి కట్ అవుతాయి.
Also Read : గ్యాస్ సిలిండర్ ధరల సవరింపు
LPG సిలిండర్ ధర
ప్రతి నెలా మొదటి రోజున LPG గ్యాస్ సిలిండర్ల ధరలలో కూడా మార్పులు కనిపిస్తాయి. ఇందులో భాగంగానే మార్చి 1 నుంచి వాణిజ్య LPG సిలిండర్ ధర పెరిగింది. ఫిబ్రవరి లో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 7 తగ్గించారని, మార్చిలో మాత్రం 6 రూపాయలు పెంచారు. 14 కిలోల గృహ సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పు కనిపించలేదు.
మ్యూచువల్ ఫండ్..
మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాల ఓపెన్ చేసేందుకు మార్చి1 నుంచి సెబీ కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఈ ఖాతాల్లో 10మంది నామినీలను చేర్చవచ్చు. ఇన్వెష్టర్లు తాము నామినేట్ చేసిన వ్యక్తులకు ఎంత శాతం మొత్తాన్ని కేటాయించాలో ముందుగానే నిర్ణయించుకోవచ్చు. మార్చి 1 నుంచి ఫిక్స్ డిపాజిట్ల( FD ) రూల్స్ కూడా మారనున్నాయి. చాలా బ్యాంకులు తమ FD రేట్లను మార్చాయి.
పన్ను సంబంధిత మార్పులు
మార్చి 1 నుంచి ట్యాక్స్ రూల్స్ కూడా మారనున్నాయి. ట్యాక్స్ పేయర్స్ ఊరట కలిగించేలా పన్నుల శ్లాబ్ లు, టీడీఎస్ లిమిట్స్ మారనున్నాయి. దీనితో పాటు సీనియర్ సిటిజన్లకు TDS లిమిట్ రూ.50వేల నుంచి రూ.1 లక్షకు పెంచనున్నారు.