ఐపీఎల్ నుంచి తప్పుకునే ఫారెన్ ప్లేయర్ల విషయంలో 10 మంది ఫ్రాంచైజీలు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. రెండు నెలల పాటు సుదీర్ఘంగా జరగబోయే ఐపీఎల్ నుంచి కొంతమంది విదీశీ ఆటగాళ్లు అనవసర సాకులు చెప్పి తప్పుకుంటున్నారని.. వీరిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జట్ల ఫ్రాంచైజీలు గతంలో చెప్పుకొచ్చారు. వీరి అభ్యర్ధనను బీసీసీఐ గౌరవించింది. దీంతో ఐపీఎల్ నుంచి తప్పుకునే విదేశీ క్రికెటర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోనుంది.
ఐపీఎల్ తాజా నియమం ప్రకారం వేలంలో ఎంపిక చేయబడిన విదేశీ ప్లేయర్.. సీజన్ ప్రారంభానికి అందుబాటులో లేకపోతే టోర్నమెంట్ నుండి నిషేధించబడతాడు. అంతే కాదు ఆ తర్వాత జరగనున్న రెండు ఐపీఎల్ సీజన్ ఆడడానికి వీలు లేదని అధికారిక ప్రకటన తెలిపింది. దీంతో పాటు ఎవరైనా ఓవర్సీస్ ఆటగాడు రానున్న మెగా యాక్షన్ కోసం తమ పేరును నమోదు చేసుకోవాలి. ఒకవేళ విదేశీ ఆటగాడు తన పేరును నమోదు చేసుకోకపోతే.. అతను ఆ తర్వాత జరగబోయే వేలంలో తన పేరును నమోదు చేసుకోవడానికి అనర్హుడవుతాడు."
ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జాన్ బట్లర్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు దూరమవ్వడం ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. వానింద్ హసరంగా సైతం గాయం కారణంగా తప్పుకోవడంతో సన్ రైజర్స్ జట్టు స్పిన్ విభాగంలో బలహీనంగా కనిపించింది. జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్, వనిందు హసరంగా, ముజీబ్ ఉర్ రెహమాన్, ఆడమ్ జంపా, మార్క్ వుడ్ లాంటి స్టార్ ఆటగాళ్లు వేలంలో తక్కువకు అమ్ముడవ్వడంతో ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపించలేదు. వ్యక్తిగత కారణాలు, గాయాలు వంక చెప్పి ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. దీనిపై ఫ్రాంచైజీలు సంతోషంగా లేరు.
A TERRIFIC MOVE BY THE BCCI FOR IPL AUCTION...!!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 28, 2024
- If any overseas player doesn't register for Mega Auction, then he'll be ineligible for next year's auction.
- Any player who withdraws after getting picked will be banned for 2 IPL seasons. pic.twitter.com/tTmNaOv0q5