Raksha bandhan 2024:  రాఖీ కట్టేందుకు.. తీసేందుకు కూడా నియమాలున్నాయి...

Raksha bandhan 2024:  రాఖీ కట్టేందుకు.. తీసేందుకు కూడా నియమాలున్నాయి...

శ్రావణ పౌర్ణమి .. రాఖీ పండుగ..  అన్నా.. చెల్లెళ్లు,,,, అక్కా...తమ్ముళ్లు సంబరాలు చేసుకునే పండుగ.  ఈ ఏడాది ( 2024)  రాఖీ పండగ ఆగస్టు 19 వచ్చింది. ఆ  రోజున చాలా మంది సోదరీమణులు... తమ సోదరులకు  చాలా ఉత్సాహంతో రాఖీని కడతారురు.  అయితే కొంతమంది  ఒకట్రెండు రోజుల తర్వాత ఆ రాఖీని తీసి ఎక్కడో పడేస్తారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీని ఒకటి లేదా రెండు రోజుల తర్వాత విసిరేస్తారు. ఇలా తీసేయకూడదని... అశుభమని పండితులు చెబుతున్నారు.  రక్షాబంధన్ తర్వాత ఎన్ని రోజుల వరకూ రాఖీని ఉంచుకోవాలి.. తర్వాత ఏం చేయాలో తెలుసుకుందాం.....

ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండగను  జరుపుకుంటారు. ఈ పండుగ అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమకు ప్రతీక. ఈ రోజున ( ఆగస్టు 19) తమ సోదరీమణుల దీర్ఘాయువుని కోరుతూ సంతోషకరమైన జీవితం కోసం సోదరుల మణికట్టుకు రాఖీ కడతారు. సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తారు. మంచి, చెడు సమయాల్లో తమ సోదరీమణులను ఎల్లప్పుడూ ఆదుకుంటామని వాగ్దానం చేస్తారు. రాఖీ పండగ రోజున చాలా మంది సోదరులు చాలా ఉత్సాహంతో రాఖీని కట్టుకుంటారు. అయితే ఒకట్రెండు రోజుల తర్వాత ఆ రాఖీని తీసి ఎక్కడైనా విసిరివేస్తారు.  అలా తీసేయకూడని..అశుభమని ఈ తప్పు చేయకూడదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అలానే రాఖీ కట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలున్నాయని పండితులు చెబుతున్నారు. 

రాఖీ కట్టేటప్పుడు.....

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రక్షాబంధన్ రోజున రాఖీ కట్టించుకోవడానికి సోదరుడు తూర్పు ముఖంగా కూర్చోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో సోదరి పడమర ముఖంగా ఉండటం శుభప్రదం. రాఖీ కట్టే ముందు సోదరుడికి కుంకుమ, చందనంతో తిలకం దిద్ది.. ఆ తర్వాత అక్షతలను తలపై వేయాలి. దీని తర్వాతే రాఖీ కట్టాలి.రాఖీ కట్టేముందు.. ముందుగా దేవుడి పాదాల ఉంచి ఆతరువాత ఆ రాఖీని కట్టాలి. 

రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలంటే..

రక్షాబంధన్ తర్వాత రాఖీని ఒకటి లేదా రెండు రోజుల్లో తీసి విసిరేయకూడదు. రాఖీని కనీసం 21 రోజులు ఉంచుకోవాలి. ఇన్ని రోజులు రాఖీ చేతికి ఉంచుకోలేకపోతే కనీసం శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు అయినా సోదరి కట్టిన రాఖీని ఉంచుకోవాలి.

తర్వాత రాఖీని ఏం చేయాలి...

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాఖీని తీసివేసిన తర్వాత దానిని ఎక్కడ బడితే అక్కడ విసిరేయకుండా ఆ రాఖీని ఎర్రటి గుడ్డలో చుట్టి పవిత్ర స్థలంలో లేదా మీ సోదరికి సంబంధించిన వస్తువులతో ఉంచండి. మళ్ళీ వచ్చే రాఖీ పండగ వరకు ఉంచండి. తరువాత ఆ రాఖీని ప్రవహిస్తున్న నీటిలో వదిలివేయండి. రాఖీ విరిగిపోయినా లేదా చినిగిపోయినా దానిని ఒక రూపాయి నాణెంతో పాటు చెట్టు మూలాల దగ్గర పాతిపెట్టండి లేదా నీటిలో వదలండి