ప్రైవేట్ ​హాస్పిటల్స్​ రూల్స్​ పాటించాలి

మంచిర్యాల, వెలుగు: ప్రైవేట్ హాస్పిటల్స్ కచ్చితంగా రూల్స్​పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్​ జీసీ. సుబ్బారాయుడు అన్నారు. డీఎంహెచ్ఓ ఆఫీస్​లో శుక్రవారం హాస్పిటల్స్ మేనేజ్​మెంట్లతో మీటింగ్​ ఏర్పాటు చేశారు. హాస్పిటల్​లో ​రిజిస్ర్టేషన్​ సర్టిఫికేట్ తోపాటు డాక్టర్ల పేర్లు, వారి క్వాలిఫికేషన్, అందించే సేవల వివరాలను రెండు మూడు చోట్ల డిస్​ప్లే చేయాలన్నారు. 

అలాగే కన్సల్టెంట్ డాక్టర్లు ఏ టైమ్​కు వస్తారు? ఫీజు వివరాలను సైతం డిస్​ప్లే చేయాలని ఆదేశించారు. హాస్పిటల్​లో  క్వాలిఫైడ్​పారామెడికల్ స్టాఫ్​ఉండాలని, అంబులెన్స్​లలో వచ్చిన పేషెంట్ల వివరాలను నమోదు చేయాలని పేర్కొన్నారు. మూడ్రోజుల్లోగా ఈ మేరకు మార్పులు చేసుకోవాలని డీఎంహెచ్​ఓ ఆదేశించారు. వసుధ, ఓంసాయి, గౌతమి, జైసాయి, లోటస్​, మెడిలైఫ్, కిరణ్, హెల్త్​కేర్, అమృత, సిటీకేర్, సిద్ధి, స్శర్శ్, రాఘవేంద్ర, కాకతీయ హాస్పిటల్స్​ నిర్వాహకులు  తదితరులు పాల్గొన్నారు.