చందమామ కోసం కిరణ్​ అబ్బవరం

చందమామ కోసం కిరణ్​ అబ్బవరం

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏ.ఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ కాగా, ఆదివారం మూడో పాటను విడుదల చేశారు. 

‘ఎందుకు రా బాబు.. కొంచెం ఆగురా బాబు.. నీ చెడ్డీ ఫ్రెండ్స్.. ఇస్తున్నాం అడ్వైజ్. వినరా ఓ బాసు  లేకుంటే నీకు లాసు.. మన లోకల్ బారే ఫైవ్ స్టార్ అనుకోరా మామ..అరె ఎందుకు రా బాబు.. అందని చందమామ కోసం నువ్వే ఆశపడతావు’ అంటూ కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ రాశారు. అమ్రిష్ గణేష్ కంపోజ్ చేయగా, రాహుల్ సిప్లిగంజ్, రేవంత్ పాడిన తీరు ఆకట్టుకుంది.