Varalakshmi Vratam 2024: వరలక్ష్మి వ్రతం రోజు  ఆచరించాల్సిన నియమాలు ఇవే..

Varalakshmi Vratam 2024: వరలక్ష్మి వ్రతం రోజు  ఆచరించాల్సిన నియమాలు ఇవే..

వరలక్ష్మి వ్రతం స్త్రీలకు  అతి ముఖ్యమైన వ్రతం. పవిత్రమైన శ్రావణమాసంలో అతి ముఖ్యమైన రెండు వ్రతాలు చోటుచేసుకుంటాయి. వాటిలో కీలకమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. శ్రావణమాస శుక్లపక్షంలో పున్నమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీవ్రతంగా జరుపుకుంటాం. ఇది ప్రతి ముత్తయిదువ తమ కుటుంబ సౌభాగ్యం కోసం విధిగా ఆచరించాల్సిన వ్రతం. ఈ వ్రతం వెనుక ఎన్నో పురాణ గాధలు మనకు కనిపిస్తాయి.

లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు ఈ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం ( ఆగస్టు 16)  లేదా పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వత్రం ఈ కథను చదివిన వారికి, విన్నవారికి సకల కార్యాలూ సిద్ధిస్తాయి. ఈ వ్రతం చేసుకోవాలనుకునే వారు ముందు రోజునే ఇల్లంతా శుభ్రంగా కడిగి, ముగ్గులు వేసి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, గడపకు పసుపు, కుంకుమ అలంకరించుకోవాలి. 

ఇంటిలో ఈశాన్యమున రంగవల్లులు వేసి, మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపంపైన వెండి లేదా కంచు, ఇత్తడి పళ్లెరాన్ని వుంచి అందులో బియ్యం పోసి దాని మీద వెండి, బంగారం లేదా కంచు, రాగి కలశాన్ని వుంచాలి. ఈ కలశంలో కొత్తచిగుళ్లు గల మర్రి లేదా ఇతర మొక్కల చిగుళ్లను వుంచాలి. కలశాన్ని గంధం, పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి.  కలశంపై కొబ్బరికాయను వుంచి దానిని కొత్త రవికల గుడ్డతో అలంకరించుకోవాలి.

ఏమేమి నియమాలు పాటించాలంటే...

  • 1. వరలక్ష్మి వ్రతం చేయి ఇంటి లో ఎవరు ఆ రోజు మద్యం, మాంసం సేవించరాదు. సిగరెట్ త్రాగకూడదు.
  • 2 కలశం తీసే ముందు ఒక ప్లేట్లో ఎరుపు రంగు నీరు పోసి, అందులో కర్పూరం పెట్టి హారతి వెలిగించి, అమ్మవారికి హారతి నిచ్చి, ఆ నీటిని తులసి మొక్కకు పోయాలి.  తరువాత కలశం తీయాలి.
  • 3. వరలక్ష్మీ వ్రతం  రోజు సాయంత్రం అంటే సంధ్యా సమయంలో ( 5.30 గంటలనుంచి 7 గంటలవరకు)  ఇంటి తలుపులు వేయకూడదు. తెరచి ఉంచాలి
  • 4. ఇంటి ముందు గుమ్మాన్ని లక్ష్మి దేవి అని భావించి పసుపు, కుంకుమ పెట్టి అలంకరించాలి.
  • 5. వరలక్ష్మి వ్రతం చేసిన వారు మధ్యాహ్నం. విస్తరాకులోనే భోజనం చేయాలి.
  • 6. ఇంట్లో ఎవరికైనా మైల ఉంటే నైవేద్యం. ..వండి పెట్టకూడదు... కొబ్బరి కాయ కొట్ట కూడదు.
  • 7. ఇంటిలో గొడవలు పడకూడదు.
  • 8. వాడిన నూనెతో ప్రసాదం చేయరాదు.
  • 9. డబ్బులు దండ అమ్మవారికి వేయకూడదు.