గాడి తప్పిన పాలన : రిటైర్డ్​ ప్రొఫెసర్ గుగులోత్‌‌‌‌ వీరన్న నాయక్‌‌‌‌

గాడి తప్పిన పాలన : రిటైర్డ్​ ప్రొఫెసర్ గుగులోత్‌‌‌‌ వీరన్న నాయక్‌‌‌‌

ఆశించిన లక్ష్యాలు సాధించడంలో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. వారు ఇచ్చిన హామీలు నీళ్ళు, నిధులు, నియామకాలను సాధించడంలో  కేసీఆర్​ పాలనా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత సమర్థవంతంగా పనిచేసే మేధావులను, సంస్థలను, రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉక్కుపాదం మోపడమే కాకుండా ధర్నాచౌక్‌‌‌‌ను కేసీఆర్​ సర్కారు ఎత్తివేసింది. ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌‌‌‌ను చీల్చడం వల్ల తాత్కాలికంగా ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందినా నేడు ప్రజలు వాస్తవాన్ని  గ్రహించినారు. ప్రతిపక్షమే లేకుండా చేసి అప్రజాస్వామిక పరిపాలన నడిపిన కేసీఆర్​ తీరు ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసింది.

నీళ్లు :  తెలంగాణ రాష్ట్ర సాధనలో నీళ్లను ప్రధాన అంశంగా ప్రచారానికి వాడుకోవడం జరిగింది. నీళ్లను నిల్వ చేయాలంటే డ్యామ్‌‌‌‌లు చాలా అవసరం. దీనికి మొదట చెరువుల పూడిక తీయటం. తూతూ మంత్రంగా “మిషన్‌‌‌‌ కాకతీయ” పనులను కొనసాగించడం జరిగింది. కానీ, ఆ తరువాత  భారీ నీటిపారుదల ప్రాజెక్టుల మీద దృష్టి సారించి గోదావరి నదిపై సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణం చేపట్టినారు. వీటిని తక్కువ కాలంలోనే నిర్మించడం జరిగింది. దాని వలన కాళేశ్వరం అంచనాకు పొంతన కుదరక ఎనభై ఐదు వేల కోట్లతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు లక్ష ముప్పై వేల కోట్లను దాటి పోయింది. అతి తక్కువ కాలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు డిస్కవరీ ఛానల్‌‌‌‌ ద్వారా చాలా గొప్ప విజయంగా ప్రచారం చేసుకోవడం కూడా జరిగింది. ఈ ప్రాజెక్టుకు గత సంవత్సరం వచ్చిన వరదల కారణంగా సైడ్ వాల్‌‌‌‌లు కూలి బాహుబలి మోటార్​ సైతం మునిగిపోయిన విషయం విదితమే.  ప్రస్తుతం మేడిగడ్డ ప్రాజెక్టు పది పిల్లర్లు  కుంగిపోయాయి. సుమారు 50మీటర్ల మేరకు పది పిల్లర్లు కుంగిపోవడంతో మహారాష్ట్ర – తెలంగాణకు ఈ బ్రిడ్జిపై రాకపోకలను నిషేధించడం జరిగింది. అన్నారం బ్యారేజీలోని 18 నుంచి 21 పిల్లర్లు బుంగలు పడి ప్రాజెక్టు నిర్మాణమే ప్రమాదకరంగా మారింది.  కేంద్ర జలవనరుల శాఖ ప్రాజెక్టును పరిశీలించి దాని డిజైన్‌‌‌‌, ప్రణాళికలో నిర్మాణ లోపాలను గుర్తించింది. ప్రస్తుతం ప్రాజెక్టు కూలిపోయే దుస్థితికి చేరుకుంది. దీంతో అపారమైన ప్రజాధనం ఎటువంటి ఉపయోగం లేకుండానే నీటిపాలైంది.

నియామకాలు :  తెలంగాణ ఉద్యమంలో నియామకాలు కీలక అంశంగా పని చేసింది. అయితే, నియామకాలు అనేది కేసీఆర్‌‌‌‌ కుటుంబానికి మాత్రమే కలిసిరావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 39 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్క శాతం ఉద్యోగాలు కూడా రాకపోవడం  అప్రజాస్వామికానికి నిదర్శనం. గ్రూప్‌‌‌‌-1, 2, 3, 4 ఉద్యోగాలు మూడు లీకేజీలు ఆరు రద్దులుగా తయారు అవడం జరిగింది.  టీఎస్​పీఎస్సీ చైర్మన్‌‌‌‌గా ఉన్నవారు టీఎస్​పీఎస్సీను పారదర్శకంగా నిర్వహించడంలో ఘోరంగా వైఫల్యం చెందారు. పేపర్ల లీకేజీలు,  పరీక్షల రద్దుతో ఉద్యోగాల భర్తీలో విఫలమయ్యారు. సుమారు 200 మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనుటకు పరోక్షంగా కారకులయ్యారనేది కాదనలేని నిజం.  కోటి ఆశలతో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగులు కేసీఆర్​ సర్కారు, టీఎస్​పీఎస్సీపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్త్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం అసమర్థత వల్ల మద్యం వరదలై పారడం జరుగుతోంది. దానివల్ల సమాజంలో హింస పెరిగింది. మద్యం వల్ల ఆదాయం వచ్చినా ప్రజలకు జరిగిన నష్టాన్ని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. మనసులను కలిచివేసే దిశలాంటి సంఘటనలు ఎన్నో  జరిగాయి. గంజాయి, మద్యం, డ్రగ్స్‌‌‌‌ యువత నిత్యావసరాలుగా మారడం జరిగింది. గ్రామగ్రామాన బెల్టు షాపులు నిర్వహించి ప్రజల సొమ్మును దోచుకొని తాగుబోతుల తెలంగాణగా మార్చినది ఈ ప్రభుత్వం. తెలంగాణలోని అన్నివర్గాల ప్రజలను కేసీఆర్​ సర్కారు వంచనకు గురి చేసింది.

స్పష్టత లేని విద్యా విధానం :  బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వానికి విద్యా విధానంపై ఒక స్పష్టత లేదు.  సరైన సమీక్షలు లేకపోవడం, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విద్యావిధానంలో మార్పులకు అనుగుణంగా మన తెలంగాణలో విద్యను అనుసంధానం చేయకపోవడం వల్ల భవిష్యత్‌‌‌‌ తరాలు అంధకారంలో పడబోతున్నాయి. కేజీ టు పీజీ విద్యను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ప్రైవేటు విద్యాసంస్థలను  ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసింది. కార్పొరేట్​ విద్యా సంస్థలు వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించకుండా మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం వేసింది. ఇక ఉన్నత విద్యను కూడా గాలికి వదిలేసింది. 80 శాతానికి పైగా ఖాళీలు ఉన్నా బీఆర్ఎస్​ ప్రభుత్వం యూనివర్సిటీలలో  నియామకాలు చేపట్టలేదు.  సీనియర్‌‌‌‌ ప్రొఫెసర్స్‌‌‌‌ లేక, పరిశోధనలు కుంటుపడి వాటి అస్తిత్వానికే  ప్రమాదం ఏర్పడింది. ఏ ప్రభుత్వమైనా విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సమాజ అభివృద్ధికి దోహదపడాలి. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా విన్మరించింది. ప్రైవేటు యూనివర్సిటీలు, కార్పొరేట్​ హాస్పిటల్స్‌‌‌‌ ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నా వాటిపై నియంత్రణ కరువైంది. ఈ పరిణామాలను తెలంగాణ ప్రజలు గ్రహించారు.  చైతన్యవంతులై టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ రెండు పర్యాయాల పరిపాలనలో వాస్తవాలను గ్రహించారు. రాబోయే ఎన్నికలలో ఓటు ద్వారా ఈ అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడనున్నారు. నియంత పాలనను గద్దె దింపి  ప్రజాస్వామిక పాలనను అధికార పీఠంపై కూర్చోబెట్టాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆశించిన మార్పు వస్తుందని ఆశిద్దాం.

నిధులు దుబారా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పన్నుల మీద ఈ నాటికి జవాబుదారీతనం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ నుంచి  విడిపోయినప్పుడు లాభాల్లో ఉన్న బంగారు తెలంగాణ.. ప్రస్తుతం బందిఖానా తెలంగాణగా మారింది. రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌‌‌‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్లకు పైగా అప్పులపాలు చేశారు. ఈనాడు అప్పుల కుప్పయిన తెలంగాణలో  ప్రతి వ్యక్తి మీద దాదాపు లక్ష రూపాయల అప్పు ఉండటం జరిగింది.  కేసీఆర్​ సర్కారు  నిధులను సక్రమంగా ఖర్చు చేయకపోవడం వల్ల, దుబారా ఖర్చులతో నిధులు వృథా ఎక్కువ అవడం వలన బంగారు తెలంగాణ అప్పుల తెలంగాణగా మారింది.

- గుగులోత్‌‌‌‌ వీరన్న నాయక్‌‌‌‌,
రిటైర్డ్​ ప్రొఫెసర్,​ కాకతీయ విశ్వవిద్యాలయం

 
 

The TRS party has miserably failed to achieve the desired goals. The failure of KCR's administration in achieving their promises of water, funds and appointments is evident.