రాజమౌళి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఇదే.. !

రాజమౌళి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఇదే.. !

మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ అడ్వెంచరస్‌‌‌‌‌‌‌‌ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.  అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ నుంచే  ఈ క్రేజీ కాంబోపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం  మహేష్ క్యారెక్టర్ గురించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో రుద్ర అనే పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి  రాజమౌళి  చిత్రాల్లోని  క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌కు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. తన హీరోల పాత్రలకు యూనిక్ నేమ్ ఉండేలా చూసుకుంటారు. 

‘సింహాద్రి’లో ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సింగమలైగా, ‘ఛత్రపతి’లో ప్రభాస్‌‌‌‌‌‌‌‌ను శివాజీగా, ‘విక్రమార్కుడు’లో రవితేజను విక్రమ్ సింగ్ రాథోడ్‌‌‌‌‌‌‌‌గా, ‘మగధీర’లో రామ్ చరణ్‌‌‌‌‌‌‌‌ను కాలభైరవగా ప్రెజెంట్ చేశారు.   అలాగే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల్లోనూ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ క్యారెక్టర్స్ తగ్గ పేర్లతో ఆయా పాత్రల్లోని ఇంటెన్సిటీని చూపించారు. అలాంటి జక్కన్న ఇప్పుడు మహేష్ బాబును ‘రుద్ర’గా చూపించనుండటంతో తన పాత్రపై అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది.  

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.   ఇటీవల హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేయగా, రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ఒడిశాలోని కొన్ని రేర్ లొకేషన్స్‌‌‌‌‌‌‌‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో మహేష్ బాబుతో పాటు హీరోయిన్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ సహా ఇతర నటీనటులు పాల్గొంటున్నారు. 15 రోజుల పాటు అక్కడ షూటింగ్ జ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌గనుందని తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేఎల్‌‌‌‌‌‌‌‌ నారాయణ భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.