విడాకులు తీసుకుంటున్న మరో సినిమా జంట

విడాకులు తీసుకుంటున్న మరో సినిమా జంట

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకునే సెలెబ్రెటీస్ చాలానే ఉన్నారు. వీరూ హ్యాపీగా గడిపే కొద్దీ సమయంలోనే విడాకులు అంటూ..మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

లేటెస్ట్గా బాలీవుడ్లో ఓ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. నటుడు ఫర్దీన్‌ ఖాన్‌(Fardeen Khan)‌, ఆయన భార్య నటషా మాధ్వాని(Natasha Madhvani) మధ్య విభేదాలు ముదిరాయి. డిసెంబర్ 2005లో వివాహం చేసుకున్నఈ జంట..వారి18 ఏండ్ల కాపురానికి ఎండ్‌ కార్డ్‌ పడబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

కుటుంబ విభేదాల కారణంగా..వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని వార్తలు జోరందుకున్నాయి. వీరి వివాహ బంధంలో ఎదుర్కోలేని సవాళ్ళ మధ్య..ఈ జంట వేరుగా జీవించాలని డిసైడ్ అయ్యారంట. ఇందుకు గల కొన్ని కారణాలు వ్యక్తం అవ్వడం వల్ల ఈ పుకార్లక్లు మరింత బలం చేకూరింది.  

ఫర్దీన్‌ ఖాన్‌, ఆయన భార్య నటషా మాధ్వానికు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2013లో  కూతురు దియా ఇసాబెల్లా ఖాన్‌ జన్మించగా, 2017లో కుమారుడు అజారియస్‌ ఫర్దీన్‌ ఖాన్‌ పుట్టాడు. ఇక 2020 తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడం స్టార్ట్ అవ్వడం వల్ల..ఈ జంట ఏడాది కాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఫర్దీన్‌ఖాన్ తన తల్లితో కలిసి ముంబై లో.. భార్య నటషా తన పిల్లలతో కలిసి లండన్‌లో ఉంటుంది. దీంతో త్వరలో వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అసలైన కారణం వీరు ప్రకటించకపోయినప్పటికీ.. రూమర్లు మాత్రం వినిపిస్తున్నాయి. 

ALSO READ : Cricket World Cup 2023: కలిసిపోయిన కోహ్లీ-నవీన్ ఉల్ హక్.. హక్కుల గురుంచి గంభీర్ లెక్చర్

ఇక రీసెంట్ గా ఫర్దీన్ ఖాన్ ముంబై ఎయిర్ పోర్ట్ లో పిల్లలతో కనిపించగా..నటాషా వీరితో లేకపోవడం విడాకుల పుకార్లకు ఆజ్యం పోసింది. దీంతో అభిమానులు వీరి మధ్య ఏమై ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. త్వరలో ఈ జంట రెస్పాండ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BollywoodNow (@bollywoodnow)