Hardik Pandya: నటాషాతో తెగతెంపులు.. బ్రిటీష్ సింగర్‌తో పాండ్యా డేటింగ్!

సెర్బియా మోడల్ నటాసా స్టాంకోవిచ్‌తో తెగతెంపులు చేసుకున్న భార‌త ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా.. నెల రోజుల్లోనే మరో తోడు వెతుక్కున్నట్లు రూమ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ భారత ఆల్‌రౌండర్ బ్రిటీష్ సింగ‌ర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా, ఈ ఇద్ద‌రూ దిగిన ఫోటో లొకేష‌న్ ఒక‌టిగా ఉండ‌డంతో ఈ చర్చ మొదలైంది. దీనికితోడు వీరిద్దరూ ఇటీవల సోషల్ మీడియాలో ఒకరినొకరు అనుసరించడంతో వీరి బంధం నిజమన్న వార్తలు గప్పుమంటున్నాయి. 

గ్రీస్‌లో విహారయాత్ర

ఆగ్నేయ ఐరోపాలోని గ్రీస్ నగరం విహారయాత్రలకు పెట్టింది పేరు. ప్రస్తుతం వీరిద్దరూ గ్రీస్‌లో ఉన్నారు. కాకపోతే, కలిసి ఉంటున్నారా..! లేదా! విడివిడిగా ఉంటున్నారా..! అనేది తేలాల్సిన విషయం. ఆ ప్రాంతంలోని ఓ లొకేష‌న్ నుంచి హార్దిక్‌తో పాటు సింగ‌ర్ జాస్మిన్ ఒకే విధ‌మైన ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. 

ALSO READ | Saina Nehwal: కంగనాతో పోలుస్తూ సైనా నెహ్వాల్‌పై సెటైర్స్.. స్పందించిన బ్యాడ్మింటన్ స్టార్

బ్లూ క‌ల‌ర్ బికినీ, బ్లూ ష‌ర్ట్‌లో ధగధగ మెరిసిపోతున్న బ్రిటీష్ సింగ‌ర్ ఓ పూల్ వ‌ద్ద ఫోటో దిగింది. ఆ ఫోటో బ్యాక్‌డ్రాప్‌లో మైకోన‌స్ సీన‌రి క‌నిపిస్తోంది. అచ్చం అదే బ్యాక్ గ్రౌండ్ (పూల్) వ‌ద్ద ఉన్న వీడియోను హార్దిక్ పోస్టు చేశాడు. ఫోటోల్లో ఇద్ద‌రి బ్యాక్‌గ్రౌండ్ మ్యాచ్ కావ‌డంతో..నెటిజన్స్ ఈ జంటను ఒక్కటి చేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jasmin Walia (@jasminwalia)

బ్రిటిష్ గాయని, టెలివిజన్ ప్రముఖురాలైన జాస్మిన్ వాలియాకు ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో మంచి గుర్తింపు ఉంది. ఇంగ్లీష్, పంజాబీ, హిందీ భాషలలో ఆమె పాటలను విడుదల చేసింది. మరి పాండ్యాకు ఈమె ఎలా పరిచయమనేది తెలియాల్సిన విషయం.

కొడుకుతో కలిసి స్వదేశానికి నటాషా

గత నెలలోనే పాండ్యా.. తన మాజీ భార్య న‌టాషా స్టాంకోవిక్‌‌తో విడిపోయాడు. నాలుగేళ్ల తమ బంధంలో మూడుసార్లు వివాహం పేరుతో దగ్గరైన ఈ జంట కలిసి ఉండలేక పోయారు. ఈ విషయాన్ని హార్దిక్ భారత అభిమానులకు తెలియజేయడానికి కొన్ని గంటల ముందు తల్లీ కొడుకులిద్దరూ సెర్బియాకు వెళ్లారు. ప్రస్తుతం నటాసా స్టాంకోవిచ్, కుమారుడు అగస్త్య సెర్బియాలో ఉంటున్నారు.