అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా ప్రజలపై పన్నులు రద్దు చేయాలని హౌస్ రిపబ్లికన్ సభ్యుల కాన్ఫరెన్స్లో తన పన్ను సంస్కరణ ప్రణాళికలను వివరించాడు.
అమెరికా ప్రజలను మునుపెన్నడూ లేనంతగా..ధనవంతులుగా, శక్తివంతులుగా మార్చాల్సిన అవసరం ఉందని.. విదేశాలను సుసంపన్నం చేసేందుకు అమెరికన్ పౌరులపై ట్యాక్స వేయడానికి బదులుగా.. అమెరికా ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు విదేశాలపై దిగుమతి సుంకం పెంచాలని ట్రంప్ సమావేశంలో తన ప్రతిపాదన చేశారు.
1870 నుంచి 1913 వరకు యుఎస్ చరిత్రలో అత్యంత సంపన్నమైనది.. సుంకం ఆధారిత ఆర్థిక వ్యవస్థ అమలులో ఉందని ట్రంప్ అన్నారు. ఆ కాలంలో దిగుమతి సుంకాల ద్వారా దేశం అపారమైన ఆదాయాన్ని సంపాదించిందని ట్రంప్ స్పష్టం చేశారు.
Also Read : యూపీ లడ్డూ మహోత్సవంలో విషాదం.. వేదిక కూలి ఏడుగురు భక్తులు మృతి
అమెరికన్లపై పన్నులు రద్దు చేయాలని.. దీనివల్ల ఏర్పడు రాబడిలోటును విదేశాలపై దిగుమతి సుంకాలను విధించడం ద్వారా పూడ్చాలని ట్రంప్ ప్రతిపాదించారు. దిగుమతి సుంకాల నిర్వహణ పర్యవేక్షణకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
అమెరికా ఉద్యోగులు, కుటుంబాలను రక్షించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇండియా, చైనా, బ్రెజిల్ అత్యధిక పన్నులు విధిస్తాయని, మనం అలా చేయొద్దని, అమెరికా ప్రయోజనాలే ముఖ్యంగా సంస్కరణలు చేద్దామని చెప్పారు.