
కోల్బెల్ట్,వెలుగు: రామకృష్ణాపూర్ సింగరేణి కార్మికవాడల్లో క్రైస్తవులు శనివారం ‘రన్ ఫర్జీసస్’ కార్యక్రమం నిర్వహించారు. రాజీవ్చౌక్లో పట్టణ ఎస్ఐ రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించి క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే, ఈస్టర్శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు మరణించి మూడో రోజున సజీవుడిగా తిరిగిలేచిన శుభవార్తను ప్రజలకు తెలియజేసేందుకు ఈకార్యక్రమ నిర్వహించినట్లు చెప్పారు.