ముంబై: న్యూజిలాండ్‌తో జరిగిన 2019 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌లో రనౌట్‌తో తన కెరీర్‌లో అదే ఆఖరి రోజని తేలిపోయిందని ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ వెల్లడించాడు. విజయానికి చేరువగా వచ్చిన మ్యాచ్‌లో ఓడితే భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా కష్టమన్నాడు. ‘లోపల చాలా ప్లాన్స్ వేసుకున్నా. ఆ రనౌట్ తర్వాత ఓ ఏడాదికి రిటైర్మెంట్ ప్రకటించా. కానీ వాస్తవానికి రనౌట్ రోజే నేను రిటైర్ అయ్యాను. ఫిట్‌నెస్‌ను మానిటర్ చేసుకునేందుకు మాకు కొన్ని పరికరాలు ఇస్తారు.
నేను ట్రెయినర్ దగ్గరకు వెళ్లిన ప్రతిసారి వాటిని తిరిగి ఇచ్చేందుకు ట్రై చేశా. కానీ అతను వద్దులే మీరే ఉంచుకోండి అని చెప్పేవాడు. అప్పటికే నా మనసులో వీడ్కోలు చెప్పాలనే భావనకు వచ్చా. కానీ ఈ విషయం అతనికి చెప్పలేదు. ఏడాది తర్వాత రిటైర్మెంట్ ప్రకటించా’ అని మహీ పేర్కొన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం వల్ల దేశానికి ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశాన్ని కోల్పోతామన్నాడు. దాదాపు 15 ఏళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించి వీడ్కోలు చెప్పడం చాలా బాధగా ఉంటుందన్నాడు.