
సిద్దిపేట టౌన్, వెలుగు: స్టూడెంట్స్ కోసం స్పెషల్బస్సులు నడపాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్ డిమాండ్చేశారు. శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వివేక్ మాట్లాడుతూ.. బస్సులు సమయానికి రాక స్టూడెంట్స్ఇబ్బంది పడుతున్నారన్నారు.
సాయంత్రం కాలేజ్నుంచి ఇంటికి వెళ్లడానికి రాత్రి 9 గంటలు అవుతుందన్నారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉదయం సాయంత్రం ప్రత్యేక బస్సులు నడపాలని కోరారు. కార్యక్రమంలో పవన్, చరణ్, సాకేత్, హరీశ్, పరుశ్రామ్, అభిరామ్ పాల్గొన్నారు.
సంగారెడ్డి టౌన్ : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా కాలేజ్వేళల్లో స్టూడెంట్స్ఇబ్బందులు పడుతున్నారని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆకాశ్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆకాశ్మాట్లాడుతూ.. స్టూడెంట్స్కోసం ఉదయం, సాయంత్రం స్పెషల్ బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వెంకటరెడ్డి , నిఖిల్ , మహేశ్ ఉన్నారు.