Viral news: కాబోయే అల్లుడితో లేచిపోయిన అత్త తిరిగొచ్చింది..ఎందుకలా చేశావంటే.. కారణం ఏం చెప్పిందో చూడండి

Viral news: కాబోయే అల్లుడితో లేచిపోయిన అత్త తిరిగొచ్చింది..ఎందుకలా చేశావంటే.. కారణం ఏం చెప్పిందో చూడండి

కాబోయే అల్లుడితో లేచిపోయిన అత్త తిరిగొచ్చింది.పెళ్లికి కొన్ని రోజుల ముందే కుమార్తెకు కాబోయే భర్తతో పారిపోయిన ఆ మహిళ..సరిగ్గా కూతురి వివాహం జరగాల్సిన తేదీన తిరిగి వచ్చారు. ఇలా చేశావేంటీ అని బంధువులు, ఊళ్లో వాళ్లు నిలదీస్తే ఆమె చెప్పిన కారణాలు విని షాక్ అయ్యారు. పారిపోయిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పడంతో డీప్ షాక్ లోకి వెళ్లారు. 

యూపీకి చెందిన సప్పాదేవి అనే మహిళ కూతురికి తాళి కట్టాల్సిన వ్యక్తితో పారిపోయింది. కొద్దిరోజులు అలా నేపాల్ సరిహద్దుల దాకా వెళ్లి తిరిగి సరిగ్గా వివాహ ముహూర్తానికి తిరిగి ఇంటికి చేరుకున్నారు. కూతురికి కాబోయే భర్తతో పారిపోవడానికి గల కారణాలను సప్నాదేవీ వివరించగా.. ఎలా తప్పించుకున్నారు.. ఎందుకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారో సప్నాదేవీతో లేచిపోయిన వ్యక్తి రాహుల్ పోలీసులకు పూస గుచ్చినట్లు చెప్పేశాడు. ఏప్రిల్ మొదటి వారంలో కుమార్తె పెళ్లికి చేయించిన నగలు,రూ. 3.50 లక్షల నగుదు, వెండి ఆభరణాలు తీసుకొని కాబోయే అల్లుడితో అత్త సప్నాదేవీ పారిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఎందుకు పారిపోయారంటే.. 

తన భర్త మద్యం సేవించి తనను బాగా కొట్టేవాడని, నిరంతరం వేధింపులకు గురిచేసేవాడని సప్నాదేవీ పోలీసులకు తెలిపింది. కూతురి వివాహం రాహుల్ అనే వ్యక్తితో నిశ్చయం అయ్యాక అతను ఫోన్ చేసినప్పుడల్లా తానే మాట్లాడేదని చెప్పింది. కూతురు దీనిపై అభ్యంతరం చెప్పి తిట్టిందని, భర్త కూడా తనను బెదిరించాడని అందుకే రాహుల్ తో పారిపోవాలనిపించిందని సప్నాదేవీ చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.  

అత్తా , కాబోయే అల్లుడుపారిపోయిన తర్వాత వధువు తండ్రి జితేంద్ర కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ తన కుమార్తెతో చాలా తక్కువగా మాట్లాడేవాడని, కానీ తన భార్య సప్నా దేవితో రోజుకు 20 గంటలకు పైగా మాట్లాడేవాడని విచారణలో చెప్పాడు. పనికోసం తాను బెంగళూరులో ఉంటున్నాను.. ఇటీవల గ్రామానికి తిరిగొచ్చాను.. వీరి సాన్నిహిత్యం చూసి అనుమానం వచ్చిందని చెప్పాడు. తాను నెలకు సప్నాదేవీకి రూ. 1500 పంపిస్తానని చెప్పాడు. 

ఇక సప్నాదేవిని లేపుకుపోయిన వ్యక్తి రాహుల్ ఎలా పారిపోయారో పోలీసులకు క్లియర్ కట్ గా వివరించాడు. ‘‘మొదట అలీఘర్ నుంచి కాస్గంజ్ చేరుకొని అక్కడినుంచి బస్సులో బరేలి వెళ్లినట్టు చెప్పాడు. తర్వాత బీహార్ లోని ముజఫర్ పూర్ కు వెళ్లాం.. వారి కథ వార్తల్లోకి ఎక్కిందని తెలుసుకొని నేపాల్ సరిహద్దులకు పారిపోయామని తెలిపారు. చివరికి ఇంటికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. బస్సులో అలీఘర్‌కు తిరిగి వచ్చి మధురలో దిగి ఆపై ఓ కారులో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారని పోలీసులు తెలిపారు.