రఫ్టింగ్, జంపింగ్ ఈ రెండూ ఈజీగా ఎక్కడైనా చేయగలిగే ఎక్సర్ సైజ్లు. క్యాలరీలు కరగాలన్నా, ఫిట్గా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా రన్నింగ్, జంపింగ్ రోప్ మంచి ఛాయిస్. ఈ రెండు వ్యాయామాల్ని అలసట తెలియకుండా ఎక్కువసేపు చేయొచ్చు. ఇవి చేస్తే బరువు కంట్రోల్లో ఉంటుంది. ఫిట్గా ఉండొచ్చు కూడా. గుండె కండరాలు స్ట్రాంగ్ అవుతాయి అంటున్నాడు లైఫ్ స్టయిల్, ఫిట్ నెస్ ఇన్ ఫ్లుయెన్సర్ మయూర్ ఘరత్.
జంపింగ్ రోప్...
క్యాలరీలు త్వరగా కరగాలంటే రన్నింగ్ కంటే జంపింగ్ రోప్ చేయడమే బెటర్. రోజూ పది నిమిషాల చొప్పున అరగంట సేపు తాడాట ఆడితే దాదాపు 480 క్యాలరీలు ఖర్చవుతాయి. తాడాట ఆడితే వీపు భాగంలోని కండరాలు బలపడతాయి. శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం ఈజీ అవుతుంది. మొత్తం మీద స్టామినా పెరుగుతుంది.
రన్నింగ్ చేస్తే...
రన్నింగ్ చేస్తే గుండె కండరాలు బలపడతాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పరిగెత్తినప్పుడు రిలాక్సింగ్ హార్మోన్స్ అయిన ఎండార్ఫిన్, సెరటోనిన్ రిలీజ్ అవుతాయి. దాంతో మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల్లో ఎక్కువ ఉన్న కార్బన్ డయాక్సైడ్ బయటకి పోతుంది. శ్వాస వ్యవస్థలోని కండరాలు స్ట్రాంగ్ అవుతాయి. లంగ్స్ ఏవైనా సమస్యలుంటే తగ్గిపోతాయి.