కీసర, వెలుగు: రన్నింగ్ బైక్‌లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. సిద్దిపేటకు చెందిన ప్రవీణ్ శుక్రవారం తన పల్సర్ 220 బైక్‌పై బోడుప్పల్ నుంచి కీసర మీదుగా వస్తున్నాడు. నాగారం వద్ద బైక్‌లో నుంచి పొగలు రావడంతో పక్కనే ఆపాడు. అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తి అగ్నికి ఆహుతైంది.
ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.