రన్నింగ్​ కారులో మంటలు

గండిపేట్, వెలుగు : నార్సింగి పరిధిలో గురువారం ఓఆర్ఆర్​పై ​రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై కారును పక్కకు ఆపాడు. వెంటనే ప్రయాణికులను కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. కారు కొనుగోలు చేసి 45 రోజుల కూడా కావట్లేదని బాధిత డ్రైవర్ నరేందర్ ఆవేదన వ్యక్తం చేశాడు.