
న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం మరింత పడింది. ట్రంప్ ప్రభుత్వం మెక్సికో, కెనడా, చైనాపై టారిఫ్‌లు వేయనుండడంతో ఏకంగా 55 పైసలు క్షీణించి జీవిత కాల కనిష్టమైన 87.17కి చేరుకుంది. మేజర్ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడడం, గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవ్వడంతో రూపాయి విలువ పడిందని ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొన్నారు.
డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం 87 దగ్గర ఓపెన్ కాగా, ఇంట్రాడేలో 87.29 వరకు క్షీణించింది. చివరికి 87.17 దగ్గర సెటిలయ్యింది. విదేశీ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్ట్‌మెంట్లు ఇండియా నుంచి వెళ్లిపోతుండడంతోపాటు, యూఎస్ డాలర్ బలపడడంతో రానున్న సెషన్లలో కూడా రూపాయి విలువ పడుతుందని, ట్రంప్ ప్రభుత్వం టారిఫ్ వార్‌కు తెరతీస్తుండడంతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోందని ఎనలిస్టులు వివరించారు.