
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులు వస్తుండడంతో ఇండియన్ రూపాయి బలపడుతోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం 31 పైసలు బలపడి 85.67 కి చేరుకుంది. ఈ నెల 21న కూడా 38 పైసలు పెరిగింది.
గత ఏడు సెషన్లలో రూపాయి విలువ ఏకంగా 154 పైసలు బలపడింది. ఈ ఏడాది వచ్చిన నష్టాల నుంచి రికవర్ అయ్యింది. కిందటేడాది డిసెంబర్ 31న డాలర్ మారకంలో రూపాయి విలువ 85.64 గా రికార్డయ్యింది. స్టాక్ మార్కెట్ పెరుగుతుండడం, విదేశీ పెట్టుబడులు వస్తుండడం , క్రూడాయిల్ ధరలు తగ్గడం, డాలర్ బలహీనపడడంతో రూపాయికి సపోర్ట్ లభిస్తోంది. లిక్విడిటీ కొరత, ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లు వంటి సమస్యలు లేకపోలేదని ఎనలిస్టులు తెలిపారు.