Rupee slumps to record low: రికార్డు స్థాయిలో డౌన్.. ఏడు నెలల కనిష్టానికి రూపాయి విలువ

Rupee slumps to record low: రికార్డు స్థాయిలో డౌన్.. ఏడు నెలల కనిష్టానికి రూపాయి విలువ

రూపాయి విలువు దారుణంగా పడిపోయింది.. శుక్రవారం ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. డెలివరీ చేయని ఫార్వార్డ్ లు మెచ్యూర్ కావడం, కరెన్సీ్ ప్యూచర్లు డాలర్ కు డిమాండ్ ను పెంచడంతో  ఏడు నెలల కనిష్ట విలువను నమోదు చేసింది.

ట్రేడర్ల ప్రకారం.. రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 85.8075 కనిష్ట స్థాయికి బలహీనపడింది. శుక్రవారం 0.3శాతం క్షీణించిన రూపాయి.. 2024 జూన్ 4 తర్వాత ఇంత దారుణంగా రూపాయి విలువ పడిపోవడం ఇదే తొలిసారి. గత 8 వారాలుగా రూపాయి విలువ పడిపోతూనే ఉంది. 

ALSO READ : దిగ్గజ పారిశ్రామికవేత్త ఒసాము సుజుకీ కన్నుమూత

యూఎస్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికతో నెలకొన్న పరిణామాలు, మందగిస్తున్న భారత్ వృద్ధి, వాణిజ్య లోటుపై ఆందోళనలు, ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడుతుండటంతో రూపాయిని డెబ్బతీశాయి. దీంతో గత ఎనిమిది సెషన్లలో రూపాయి రికార్డు కనిష్టానికి పడిపోయింది.