నెలరోజులుగా ఇదే పరిస్థితి..రూపాయి విలువ 14 పైసలు డౌన్

న్యూఢిల్లీ: డాలర్​తో రూపాయి మారకం విలువ శుక్రవారం 18 పైసలు తగ్గి మొదటిసారిగా కీలకస్థాయి 86 స్థాయికి క్షీణించింది. డాలర్ ​బలోపేతం కావడం, విదేశీ నిధుల ప్రవాహం పెరగడంతో రూపాయి పతనం కొనసాగింది. 

క్రూడాయిల్​ధరలు పెరగడం, మనదేశ ఈక్విటీ మార్కెట్లలో నెగటివ్​సెంటిమెంట్ ​కూడా రూపాయిని దెబ్బకొట్టాయి. ట్రంప్​అధికారంలోకి వచ్చాక వాణిజ్యానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటారనే అంచనాల మధ్య డాలర్​ విలువ పెరుగుతోంది. ఇంటర్​ బ్యాంక్​ ఫారిన్​ ఎక్స్చేంజ్​లో రూపాయి 85.88 వద్ద మొదలై 86 (తాత్కాలికం) వద్ద ముగిసింది.