ముసలోడే కానీ మహానుభావుడు.. 92 ఏళ్ల వయస్సులో బిలియనీర్‌ ఐదో పెళ్లి

మీడియా మెఘల్‌, ఫాక్స్ అండ్ న్యూస్ కార్ప్స్ మాజీ ఛైర్మన్ రూపర్ట్ మర్దోక్(92) ఐదో పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రియురాలు, మాలిక్యులర్ బయాలజిస్ట్ ఎలీనా జుకోవాను పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఏడాది జూన్‌లో కాలిఫోర్నియాలోని మార్దోక్‌ ఎస్టేట్‌లో వీరి వివాహం జరగనున్నట్లు నివేదికలు వస్తున్నాయి. వీరిద్దరూ గతేడాది సమ్మర్ నుంచే డేటింగ్‌ లో ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఆమెకిది రెండో వివాహం.

ఎవరీ జుకోవా..?

రూపర్ట్ మర్దోక్ మూడో భార్య వెండి డెంగ్ ద్వారా ఎలీనా జుకోవా పరిచయం అయినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. రష్యాకు చెందిన ఎలీనా జుకోవా రిటైర్డ్ మాలిక్యులర్ బయాలజిస్ట్. ఆమె అమెరికాకు వలస వచ్చారు. ఆమెకు ఇది రెండో వివాహం. గతంలో ఆమె బ్రిటీష్ పౌరుడిగా లండన్‌లో నివసిస్తున్న మాస్కో బిలియనీర్ అలెగ్జాండర్ జుకోవ్‌ను వివాహం చేసుకుంది. వీరికో కుమార్తె(దాషా). కొన్ని కారణాల రీత్యా ఈ జంట విడిపోయారు. కుమార్తె కు కూడా పెళ్లవగా.. ఆమె భర్త(ఓలిగార్క్‌)తో తెగదెంపులు చేసుకుంది. 

రూపర్ట్ మర్దోక్ కు ఇదివరకే నాలుగు పెళ్లిళ్లు అవ్వగా.. వారందరికి చట్టపరంగా విడాకులిచ్చారు. జుకోవాతో వివాహం ఐదోది కాగా, నిశ్చితార్థాల సంఖ్య పరంగా మాత్రం ఆరోది. గతేడాది మార్చి 17న యాన్‌ లెస్లీ స్మిత్‌ (65)తో ఎంగేజ్మెంట్‌ చేసుకోగా.. అది పెళ్లివరకూ వెళ్లకుండానే పెటాకులైంది. లెస్లీ స్మిత్‌ అభిప్రాయాల విషయంలో మర్దోక్‌ అసౌకర్యానికి గురయ్యారని అందుకే లెస్లీతో తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు అప్పట్లో కథనాలొచ్చాయి.

ALSO READ :- సమ్మక్క,సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభించిన కిషన్ రెడ్డి

మర్దోక్ మొదటి భార్య: పాట్రీషియా బుకర్‌(ఆస్ట్రేలియా)
రెండో భార్య: అన్నా మరియా మన్‌(1.7 బిలియన్‌ డాలర్ల ఆస్తి భరణంగా..)
మూడో భార్య: వెండీ డెంగ్‌
నాలుగో భార్య: జెర్రీ హాల్‌