నిజామాబాద్రూరల్, వెలుగు: గత ఎన్నికల్లో లెక్కకు మించి హామీలిచ్చి అధికారంలోకి రాగానే వాటిని మరిచిపోయిన అధికార పార్టీ లీడర్లను నిలదీయాలని రూరల్ బీజేపీ అభ్యర్థి దినేశ్ కులాచారిపేర్కొన్నారు. సోమవారం మోపాల్ మండలం న్యాల్కల్, ముదక్ పల్లి, రామేశ్వర్పూర్ తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా దినేశ్మాట్లాడుతూ.. రూరల్నుంచి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్తన ఆస్తులు పెంచుకోవడం తప్పా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఆదరించి అధికార పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్పద్మారెడ్డి, లీడర్లు రవి, నవీన్, వినోద్పాల్గొన్నారు.
ALSO READ : నర్సంపేటకు రింగురోడ్డు మంజూరు చేస్తా : కేసీఆర్