- రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
నిజామాబాద్, వెలుగు: ట్రాఫిక్ రూల్స్‌పై విద్యార్థి దశ నుంచే పిల్లలు అవగాహన పెంచుకోవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సూచించారు. నిర్లక్ష్యంగా ఉండే పేరెంట్స్ ను అలర్ట్ చేయాలన్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్‌గా తాను ఎన్నో యాక్సిడెంట్ కేసులకు సర్జరీలు చేశానన్నారు. జాతీయ రోడ్ భద్రతా మాసోత్సవాలను బుధవారం శ్రీరాంగార్డెన్లో నిర్వహించిన ప్రొగ్రాంలో ఆయన మాట్లాడారు.
టూ వీలర్ బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్, కారు డ్రైవింగ్ టైంలో సీట్ బెల్ట్ ధరించాలన్నారు. జిల్లా జడ్జి సునీతా కుంచాల, అదనపు కలెక్టర్అంకిత్, డీటీసీ దుర్గాప్రమీల, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.