బాసరలో భక్తుల రద్దీ.. తాగునీరు లేక అవస్థలు

నిర్మల్​ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో జూన్​ 11న భక్తుల రద్దీ నెలకొంది. అష్టమికి తోడు, రేపటినుంచే బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలతో దేవాలయానికి వచ్చి దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి తెలంగాణతో పాటు, ఏపీ, మహారాష్ర్ట, కర్ణాటక నుంచీ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

అమ్మ దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టిందని వారు వెల్లడించారు. క్యూలైన్లలో నిల్చున్న వారికి కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. తాగు నీరు లేక చాలా మంది ఇబ్బందిపడ్డారు.