కిటకిటలాడిన యాదగిరిగుట్ట

  • ధర్మదర్శనానికి రెండు గంటల టైం
  • శనివారం రూ.56.14 లక్షల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చుట్టు పక్కల జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయ పరిసరాలు, దర్శన, ప్రసాద క్యూలైన్లు నిండిపోయాయి. దర్శనం కోసం భక్తులు క్యూకాంప్లెక్స్, క్యూలైన్లలో గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది.

రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి రెండు గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట పట్టిందని భక్తులు తెలిపారు. మరోవైపు ఆలయంలో నిత్య పూజలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున సుప్రభాత సేవతో నిత్య కైంకర్యాలను ఆరంభించిన అర్చకులు రాత్రి పవళింపుసేవతో  ముగించారు. శనివారం భక్తులు నిర్వహించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.56,14,368 ఆదాయం వచ్చింది. ప్రసాద విక్రయం ద్వారా అత్యధికంగా రూ.20,44,600, కొండపైన వాహనాల ప్రవేశంతో రూ.7 లక్షల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కం వచ్చింది. 

దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చైర్లు

నారసింహుడిని దర్శనానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న భక్తుల కోసం వీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చైర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే బ్యాటరీ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉన్నాయని, తాజాగా వీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చైర్లను సైతం ఏర్పాటు చేశామన్నారు. కొండపైన ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద వీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్లు అందుబాటులో ఉంటాయని, చైర్లు కావాల్సిన వారు అడ్రస్, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చి నమోదు చేసుకోవాలని సూచించారు. దర్శనం అనంతరం వీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చైర్లను తిరిగి ఆలయ సిబ్బందికి సరెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని సూచించారు. వీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చైర్లు ఉపయోగించుకున్నందుకు ఎలాంటి ఛార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండదని పేర్కొన్నారు.