శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు

  • నిండిపోయిన క్యూలైన్లు
  • స్వామి దర్శనానికి 4గంటలు 

హైదరాబాద్​:  శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు  నిండిపోయాయి.  ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు  స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది.భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నారు.