శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు..

శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తుల పోటెత్తారు.వేసవి సెలవులు ముగుస్తున్న క్రమంలో మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. పైగా ఆదివారం కూడా కావటంతో క్షేత్రం మొత్తం ఎటు చూసినా వాహనాలతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు తెల్లవారుజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనం క్యూలైన్స్ లో బారులు తీరారు. 

శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని సమాచారం.అయితే భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో పెద్దిరాజు,అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.దర్శనం కోసం  క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,పాలు,బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.