భద్రాచలం,వెలుగు: భద్రాద్రికి భక్తుల రద్దీ సోమవారం కూడా కొనసాగింది. ఉదయం నుంచే దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వరుస సెలవుల నేపథ్యంలో పాపికొండల టూర్కు వచ్చిన భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. రామయ్యకు ఉదయం సుప్రభాత సేవ చేసిన అనంతరం ముత్తంగి సేవను నిర్వహించారు. ఏపీలోని విశాఖపట్టణం జిల్లా చిట్టివలస గ్రామానికి చెందిన రామారావు రూ.2లక్షల విరాళాన్ని శ్రీసీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి అందజేశారు.
సాయంత్రం స్వామికి దర్బారు సేవ జరిగింది. ఎమ్మెల్సీ మధు శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి సహకారం అందిస్తున్న 250 మందికి పైగా దాతలను టీటీడీ కాటేజీలో సోమవారం ఈవో రమాదేవి సత్కరించారు. దేవుని ఫోటోలతో పాటు, ప్రసాదం, జ్ఞాపికలను, ముత్యాల తలంబ్రాలను బహుకరించారు. చిన్నారులు శాస్త్రీయ సంగీతం, నృత్యాలతో అలంరించారు.