
ఏపీ సర్కార్ కు షాకిచ్చింది బ్లూ ఫ్లాగ్ ఫౌండేషన్.. వైజాగ్ రుషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ను ఉపసంహరించుకుంది ఫౌండేషన్. 2020లో రుషికొండ బీచ్ పరిధిలో 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్ గా సర్టిఫై చేసింది డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా రుషికొండ బీచ్ లోకి శునకాలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్న క్రమంలో బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా బీచ్ పరిసరాల్లో వ్యర్దాలు పేరుకుపోవడం.. బట్టలు మార్చుకునే గదుల దగ్గర శుభ్రత లోపించటం, నడక దారి ధ్వంసం అవ్వటం వంటి కారణాల వల్ల బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ రద్దయినట్లు తెలుస్తోంది.
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఏంటి:
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే.. డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ ఇచ్చే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు. బోట్ టూరిజంకి అనువుగా ఉండే, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన బీచ్ లకు ఈ సర్టిఫికెట్ ఇస్తారు.
ప్రభుత్వం క్లారిటీ:
రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ఉపసంహరణపై సీరియస్ అయ్యింది ఏపీ ప్రభుత్వం. తక్షణమే పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ప్రభుత్వం.బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను రద్దు చేయలేదని.. తాత్కాలికంగా మాత్రమే ఉపసంహరించారని వివరణ ఇచ్చింది ప్రభుత్వం.
సేఫ్టీ ప్రోటోకాల్స్ అప్‌డేట్ చేయాలని బ్లూఫ్లాగ్ ఫౌండేషన్ సూచించిందని.. రెండు రోజుల్లో ఆడిట్ తర్వాత పునరుద్ధరిస్తాంస్పష్టం చేసింది ప్రభుత్వం.